విశాఖ స్టీల్ : హైకోర్టులో లక్ష్మీనారాయణ పిల్

Join Our Community
follow manalokam on social media

ఏపీ హైకోర్టులో సీబీఐ జేడీ, మాజీ జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రేపు హైకోర్టులో దీని మీద విచారణ చేపట్టనున్నారు అని  తెలుస్తోంది.  కేంద్ర కేబినెట్‌ తీసుకున్నఈ  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్‌ లో లక్ష్మీనారాయణ కోరారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రా హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయెద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మికుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...