నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్.. వెలుగులోకి సంచలన అంశాలు !

నుజీవీడులో ట్రిపుల్ ఐటీ విద్యార్దిని సూసైడ్ చేసుకుని చనిపోయిన అంశంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాధురి అనే ఈ విధ్యార్ధినికి కాకినాడకు చెందిన వినయ్ తో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది అని తెలుస్తోంది. అయితే రెండు నెలల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు చెబుతున్నారు.

hanging-suicide
hanging-suicide

మాధురి మరొకరితో చనువుగా ఉంటూ తనను దూరం పెడుతోందని భావించిన వినయ్ ఆమెను వేధించినట్టు పోలీసులు గుర్తించారు. వారం రోజులుగా ఫోన్ లో ఇద్దరి మధ్య వివాదం నడుస్తోందని పోలీసులు గుర్తించారు. వినయ్ వేధింపులకు గురి చేశాడని మాధురి ఆవేదనకు గురయిందని చెబుతున్నారు. ఆ క్షణికావేశంలో మాధురి సూసైడ్ చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. మాధురి కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు దాసరి వినయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.