తమకు వేతనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇదే విషయంపై తమ యూనియన్ పెద్దలను కలిసి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారని మెప్మా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏడు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని మెప్మా ఉద్యోగులు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే జిల్లా అధికారులను కలిసేందుకు తోటి ఉద్యోగులకు పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే మెప్మా ఉద్యోగులను పోలీసులు ముందస్తు హౌజ్ అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, ఇబ్రహీంపట్నం పోలీసులు తమను అరెస్టు చేయడంపై మెప్మా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ తమ బాధను పట్టించుకోవాలని వేడుకున్నారు.
ఉద్యోగులను కూడా హౌజ్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏడు నెలలుగా జీతాలు రావడం లేదంటూ జిల్లా అధికారులను కలవాలని పిలుపునిచ్చిన మెట్మ ఉద్యోగులు
మెట్మ ఉద్యోగులను ముందస్తు హౌజ్ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన ఇబ్రహీంపట్నం పోలీసులు pic.twitter.com/JjY9PZ7dQq
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024