అధిక బరువు తగ్గించుకునే విషయానికి వస్తే.. చక్కని డైట్ పాటించడం ఎంత అవసరమో, వ్యాయామం కూడా అంతే అవసరం. అందులో భాగంగానే అధిక శాతం మంది నిత్యం ఓ వైపు డైట్ పాటిస్తూనే.. మరోవైపు తమకు అనువైన వ్యాయామాలు చేస్తుంటారు. అందులో వాకింగ్ కూడా ఒకటి. వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ మేరకు సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు కూడా.
భోజనం చేసిన వెంటనే కొందరు వ్యక్తులను సైంటిస్టులు 15 నిమిషాల పాటు వాకింగ్ చేయమన్నారు. తరువాత వారిని పరీక్షించి చూడగా.. వారిలో షుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. అంతేకాదు, నిత్యం ఇలా భోజనం చేసిన వెంటనే 15 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గిందని, గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గిందని తేల్చారు. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు తిన్న వెంటనే వాకింగ్ చేయడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చని కూడా సైంటిస్టులు చెబుతున్నారు.
ఆహారం తిన్న వెంటనే 1 గంటలోగా 15 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాకింగ్ నెమ్మదిగా చేయాలి. పరిగెత్తకూడదు. ఇక నిత్యం 30 నిమిషాల పాటు వారంలో కనీసం 5 రోజలు పాటు వాకింగ్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇలా వాకింగ్ చేయడం వల్ల అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని వారంటున్నారు.