హైదరాబాద్ లో నిన్న కుండపోత వర్షం కురిసింది. దీంతో హబీబ్ నగrర్ లో స్మశాన వాటిక గోడ పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ గోడ పడి దాదాపు మూడు నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. అయితే గోడ కూలే సమయంలో కారులో ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బహదూర్ పురాలో 7.6 సెంటీమీటర్ల వర్షం, రూప్ లాల్ బజార్ లో 6.9 సెంటిమీటర్ల వర్షం, నాంపల్లిలో 6.1 సెంటీమీటర్ల వర్షం, బండ్లగూడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

ఇదిలా ఉండగా… నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇళ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీనివల్ల చాలా వరకు ఆస్తి నష్టాన్ని చవిచూశారు. కాగా, తెలంగాణలోని పలు జిల్లాలలో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.