లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోని పౌరులకు ఎన్నో రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లే కాదు, డబ్బును పొదుపు చేసుకుని నెల నెలా ఆదాయం పొందే ప్లాన్లను కూడా అందిస్తోంది. వాటిల్లో ఎల్ఐసీ జీవన్ అక్షయ్ ప్లాన్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే ఇన్సూరెన్స్ లభిస్తుంది. అంతేకాదు, నెల నెలా పెన్షన్ తీసుకోవచ్చు.
ఇక ఈ ప్లాన్‌లో భాగంగా కనీసం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఎల్ఐసీ నిన్న మొన్నటి వరకు నిలిపివేశారు. కానీ ఈ ప్లాన్‌ను మళ్లీ కొనసాగిస్తున్నారు. 30 నుంచి 85 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా సరే ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ఇది ఆన్యుటీ ప్లాన్. కనుక పెట్టుబడి పెట్టిన వెంటనే నెల నెలా పెన్షన్ తీసుకోవడం ప్రారంభించవచ్చు.
ఈ ప్లాన్‌లో కనీసం రూ.1 లక్ష పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. లిమిట్ లేదు. ఉదాహరణకు 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు రూ.7 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుని రూ.7,12,600 ప్రీమియం కడితే ఈ ప్లాన్‌లో ఏడాదికి రూ.54,145 పెన్షన్ పొందవచ్చు. అదే 6 నెలలకు అయితే రూ.26,513, 3 నెలలకు అయితే రూ.13,107, నెలనెలా అయితే రూ.4,337 పెన్షన్ వస్తుంది. ఇలా ఈ పథకం కింద నెల నెలా పెన్షన్ పొందవచ్చు.