ఈ వాలెంటైన్స్ డే ని విదేశాల్లో జరుపుకోవాలనుందా..? అయితే IRCTC థాయ్‌ల్యాండ్ ప్యాకేజీని చూడండి..!

-

మీరు ఈసారి వాలెంటైన్స్ డే ని విదేశాల్లో జరుపుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఐఆర్‌సీటీసీ తీసుకు వస్తున్నా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాలి. వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్‌ల్యాండ్ టూర్ ని ఐఆర్‌సీటీసీ టూరిజం తీసుకు వచ్చింది. దీనితో మీరు ఎంచక్కా ఈ ప్యాకేజీ ద్వారా థాయ్‌ల్యాండ్ వెళ్లి వచ్చేయచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే..

ఈ ప్యాకేజీ ద్వారా మీరు బ్యాంకాక్, పట్టాయా చూసి వచ్చేయచ్చు. 2023 ఫిబ్రవరి 11న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. పర్యాటకుల్ని ఫ్లైట్‌లో థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లి అక్కడ నుండి టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా చూపిస్తారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మొదటి రోజు కోల్‌కతాలో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. కనుక కోల్‌కతా చేరుకోవాలి.

రాత్రి 9.45 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రెండో రోజు తెల్లవారుజామున బ్యాంకాక్ రీచ్ అవుతారు. అక్కడ నుండి పట్టాయా వెళ్ళాలి. పట్టాయాలో హోటల్‌ లో చెకిన్ అయ్యాక.. సాయంత్రం అల్కజార్ షో లేదా టిఫానీ షో చూడొచ్చు. మూడో రోజు పట్టాయా లోకల్ టూర్ ఉంటుంది. ఇక్కడ మీరు కోరల్ ఐల్యాండ్ సందర్శించవచ్చు. షాపింగ్ కి కూడా వెళ్ళచ్చు.

నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ వెళ్లాలి. రివర్ క్రూజ్ రైడ్ ఉంటుంది. ఐదో రోజు బ్యాంకాక్ టూర్ ఉంటుంది. సఫారీ వాల్డ్ టూర్, మెరైన్ పార్క్ చూసేయచ్చు. నైట్ తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. 2.55 గంటలకు బయల్దేరితే తెల్లవారుజామున 4 గంటలకు కోల్‌కతా రీచ్ అవుతారు. ఇక ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.48,300, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.56,364 చెల్లించాలి. వెబ్ సైట్ లో పూర్తి వివరాలని చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version