గడ్డం పెరగాలని కోరుకునేవారు సాధారణంగా తమకు తెలియకుండానే పలు పొరపాట్లు చేస్తుంటారు. వాటిని సరిదిద్దుకుంటే గడ్డాన్ని త్వరగా పెంచుకోవచ్చు.
పురుషుల్లో కొందరు గడ్డం అస్సలు ఉంచుకోరు. ఎప్పుడూ నీట్ షేవ్‌తో దర్శనమిస్తారు. ఇక కొందరికి గడ్డం అంటేనే ఇష్టం ఉంటుంది. దీంతో వారు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. అయితే కొందరికి మాత్రం గడ్డం పెంచుకోవడమంటే ఇష్టం ఉంటుంది కానీ వారి గడ్డం అంత త్వరగా పెరగదు. దీంతో వారు నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన పలు పొరపాట్లను చేయకుండా ఉంటే దాంతో గడ్డం త్వరగా పెరుగుతుంది. మరి గడ్డం పెంచాలనుకునే వారు చేసే పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. చాలా మంది పురుషులు నిత్యం తలపై ఉన్న వెంట్రుకలను దువ్వుతారు కానీ గడ్డాన్ని దువ్వరు. అలాగే ఉంచుతారు. కానీ అలా చేయరాదు. గడ్డాన్ని నిత్యం దువ్వడం వల్ల ఆ ప్రాంతంలో రక్త సరఫరా మెరుగుపడి అక్కడ వెంట్రుకలు త్వరగా పెరుగుతాయి. దీంతో గడ్డం త్వరగా పెరుగుతుంది.
2. చాలా మంది గడ్డాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేస్తుంటారు. కానీ చేయరాదు. గడ్డం పెరగాలనుకునేవారు తరచూ ట్రిమ్మింగ్ చేయడం మానుకోవాలి. దీంతో గడ్డం త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
3. సాధారణంగా కొందరు పురుషులు తమ జుట్టు, ముఖం తదితర భాగాలకు కావల్సిన కాస్మొటిక్స్ వాడుతారు. కానీ గడ్డం కోసం ఏమీ వాడరు. అలా చేయకూడదు. గడ్డం పెరిగేందుకు మార్కెట్‌లో పలు కాస్మొటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ట్రై చేస్తే గడ్డం శుభ్రంగా ఉండడంతోపాటు త్వరగా పెరుగుతుంది.
4. వెంట్రుకలు పెరిగేందుకు పోషకాహారం తీసుకోవడం కూడా తప్పనిసరి అనే విషయాన్ని చాలా మంది మరిచిపోతుంటారు. కానీ అలా చేయరాదు. వెంట్రుకలు పెరిగేందుకు విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, కివీ పండ్లు, క్యాప్సికం.. తదితర ఆహారాలతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు తదితర ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో గడ్డం కూడా త్వరగా పెరుగుతుంది.
5. కొందరు తలపై ఉండే జుట్టు కోసం ఇచ్చే షాంపూలను గడ్డం కోసం వాడుతారు. కానీ అలా చేయకూడదు. గడ్డం కోసం మార్కెట్‌లో దొరికే వస్తువులనే వాడాలి. షాంపూలను వాడితే గడ్డం త్వరగా పెరగదు.
6. కొందరు నిత్యం ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు కానీ గడ్డాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తారు. అలా చేయరాదు. గడ్డాన్ని కూడా రోజూ శుభ్రం చేస్తేనే ఎలాంటి దురద లేకుండా అక్కడ వెంట్రుకలు బాగా పెరిగి గడ్డం త్వరగా వస్తుంది.