నాలుగైదు రోజుల వరకు ఏపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇంకేముంది వంశీ పార్టీ మారిపోతున్నాడు… ఆయన వైసీపీ కండువా కప్పుకోవడమే లేట్ అన్నట్టుగా వ్యవహారం ఉండేది. అయితే వంశీ వెనకా ముందు డ్రామాలు ఆడుతుండడంతో ఇప్పుడు ఈ విషయం కాస్త మరుగున పడింది. వంశీ ఇద్దరు మంత్రులు అయిన కొడాలి నాని, పేర్ని నానితో పాటు సీఎం జగన్‌ను కలిసి ఏకంగా గంట పాటు సమావేశమయ్యారు. అప్పుడే ఆయన పార్టీ మారిపోతారన్న ప్రచారం ఒక్కసారిగా జోరందుకుంది.
వంశీ కూడా 4 లేదా 5 తేదీల్లో వైసీపీలో చేరిపోతారని ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఆ ప్రచారం సైలెంట్ అయ్యింది. వంశీని కొన్ని విషయాల్లో జగన్ సైతం నమ్మడం లేదని.. అందుకే వైసీపీ ఎంట్రీ లేట్ అవుతోందని అంటున్నారు. వంశీ వైసీపీలో చేరే విషయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఏం చెప్పలేదట. జగన్ రూల్ ప్రకారం పార్టీ మారేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే.
వంశీ నిజాయితీగా తన పదవిని వదులుకుని పార్టీలోకి వస్తే జగన్ తిరిగి వంశీకే ఎమ్మెల్యే సీటు ఇస్తారు. అయితే వంశీకి హైదరాబాద్‌లో వివాస్పద ఆస్తుల లెక్క చాలానే ఉందట. వాటి విలువ కోట్లలో ఉందంటున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. కాకపోతే కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని తెలుస్తోంది. వాటిని కేటీఆర్ ద్వారా సెట్ చేసుకునేందుకు మనోడు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఇక ఇప్పుడు జగన్ ద్వారా కేటీఆర్‌పై ప్రెజర్ చేసి వాటిని క్లియర్ చేసుకోవాలని చూస్తున్నాడు.
అయితే జగన్ ఇటీవల కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటున్నాడు. హైదరాబాద్‌లో వివాదాల్లో ఉన్న వంశీ ఆస్తుల విషయంలో సాయం చేసే విషయంలో జగన్ హామీ ఇవ్వలేదంటున్నారు. ఆ లెక్కన చూస్తే ఏపీలో చాలా మంది వైసీపీ నేతలకు హైదరాబాద్‌లో వివాదాల్లో ఉన్న ఆస్తులు చాలానే ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ల ఆస్తులే కోట్లలో ఉన్నాయి. ఇప్పుడు వంశీ విషయంలో జగన్ జోక్యం చేసుకుంటే తన పార్టీ నేతలకు కూడా హెల్ఫ్ చేయాలి. ఈ తలనొప్పి అంతా ఎందుకని వంశీ విషయంలో జగన్ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.
ఇక వంశీ ముందుగా ఇద్దరు మంత్రులను వేంటేసుకుని వచ్చి పార్టీ మారతానని చెప్పడంతో పాటు ఇప్పుడు డ్రామాలు ఆడడం కూడా జగన్‌కు నచ్చడం లేదట. అందుకే ప్రస్తుతానికి వంశీ వైసీపీ ఎంట్రీ లేట్ అయ్యిందని అంటున్నారు.