బస్సు ప్రమాదానికి కారణమైనా శానిటైజర్.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

-

కరోనా దరికి చేరకుండా శానిటైజర్ వాడండని వివిధరకాలుగా ప్రచారం చేస్తున్నారు అధికారులు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ కొందరు శానిటైజర్ వాడే క్రమంలో రజనీకాంత్ స్టైల్స్‌ను ఫాలో అవుతున్నారు కావచ్చూ.. అంటే శానిటైజర్‌ను చేతులకు రాసుకునే క్రమంలో వారున్న స్దితిని మరచిపోతే ఏం జరుగుతుందో ఒక బస్సు డ్రైవర్ ప్రాక్టికల్‌గా చూపించాడు.. కానీ ప్రయాణికుల ప్రాణాలు రిస్క్‌లో పెట్టాడు.. ఏ స్టైల్లో శానిటైజర్ చేతులకు రాసుకున్నాడో తెలియదు గానీ, రోడ్దు మీద వెళ్లే బస్సును కాస్త డివైడర్ మీదికి ఎక్కించాడు.. ఇంకా నయం ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు.. ఇక వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే..

సిరిసిల్ల డిపోకు చెందిన నాన్‌స్టాప్‌ ఆర్టీసీ బస్సు శుక్రవారం కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆ బస్సు వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని కరీంనగర్‌ పాల డెయిరీ వద్దకు రాగానే డ్రైవర్‌కు శానిటైజర్ గుర్తుకు వచ్చింది కావచ్చూ, వెంటనే స్టీరింగ్‌ విడిచి పెట్టి చేతులకు శానిటైజర్‌ రాసుకుంటున్న సమయంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ మీదకు దూసుకుపోగా, బస్సులో ఉన్న ప్రయాణికుల గుండెలు అరచేతిలోకి జారిపోయాయి.. అంతే ఒక్క సారిగా తీవ్ర భయందోళనతో కేకలు వేసారు.. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపేశాడు.

 

ఇకపోతే బస్సులో దాదాపు 20 మంది వరకు ఉన్నట్లు ప్రయాణికులు ఉన్నట్లుగా తెలిసింది.. అసలే కరోనా ఎంత బిజీగా ఉందో, దవాఖానాల్లో డాక్టర్లు కూడా అంతే బిజీగా ఉన్నారు.. ఈ సమయంలో ఇలాంటి వారివల్ల అనుకోని ప్రమాదాలకు గురైన వారి పరిస్దితి ఏంటో మనకు అక్కడక్కడ, అప్పుడప్పుడు వార్తల్లో వస్తుంది.. కాబట్టి, ఓ డ్రైవర్లు మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్దానాలకు చేర్చండని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కోరుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news