గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? ఏ బ్యాంకులో ఎంత ఇంట్రస్ట్‌ అంటే..!

-

గోల్డ్‌ అంటే మనకు ఒక సేవింగ్‌. అదేదో కేవలం అలంకార ప్రాయంగా కాకుండా.. కష్టకాలంలో ఆదుకోవడానికి గోల్డ్‌ను బ్యాంకులో పెట్టుకుని పైసలు తెచ్చుకుంటారు. అయితే గోల్డ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటే.. ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ వస్తుందో తెలుసా..? తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయో తెలుసుకోవడం ఉత్తమం. ఏ బ్యాంక్‌లో అయితే తక్కువ వడ్డీ రేటు ఉందో అందులో లోన్ తీసుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. అందుకే బంగారు తనఖా పెట్టి లోన్ తీసుకునే ముందు ఏ ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవాలి. దగ్గర్లో ఉన్న బ్యాంకుకు వెళ్లి పెట్టేస్తే మీరే నష్టపోతారు.

దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చౌక వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోంది. గోల్డ్‌ లోన్స్‌పై వడ్డీ రేటు 8 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే గరిష్ట వడ్డీ రేటు 16.5 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకుంటే ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో కూడా వడ్డీ రేటు తక్కువగానే ఉంది. ఈ బ్యాంక్‌లో గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. గరిష్టంగా 17 శాతం వరకు వడ్డీ రేటు పడుతుంది. ఈ బ్యాంక్‌లో గోల్డ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు 2 శాతంగా ఉంటుంది.సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో కూడా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయి. ఈ బ్యాంక్‌లో బంగారు రుణాలు తీసుకుంటే 8.25 శాతం వడ్డీ రేటు ప్రారంభం అవుతోంది. అలాగే గరిష్టంగా 19 శాతం వరకు వడ్డీ రేటు పడుతుంది.

అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తే.. గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.45 శాతంగా ఉంది. అలాగే గరిష్టంగా 8.55 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఈ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం పడుతుంది.

అలాగే యూకో బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకుంటే.. 8.5 శాతం వడ్డీ రేటు పడుతుంది. అలాగే ఈ బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు రూ. 250 నుంచి రూ. 5 వేల వరకు పడుతుంది.

గోల్డ్ లోన్ తీసుకోవాలని భావించే వారు అవసరమైన డాక్యుమెంట్ల గురించి తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి అవసరం అవుతాయి. బ్యాంక్‌ నుంచి గరిష్టంగా రూ.1,50,00,000 వరకు గోల్డ్ లోన్ పొందొచ్చు. కనీసం రూ. 20 వేల నుంచి లోన్ ఇస్తారు. అయితే బ్యాంక్ ఆధారంగా గోల్డ్ లోన్ అమౌంట్ కూడా మారుతుంది. కాగా బ్యాంకులు సాధారణంగా 18 నుంచి 22 క్యారెట్ల వరకు గోల్డ్‌పై రుణాలు ఇస్తాయి. అందువల్ల మీరు బంగారం తనఖా పెట్టి ఈజీగా లోన్ పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version