చంద్రుడిపై నీళ్లు.. తాజా నివేదికలో వెల్లడి..

-

ఆ అనంత విశ్వంలో మరో చోట ఎక్కడైనా జీవం ఉందా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అయితే.. అందుకోసం మానవుడు ఎన్నో ప్రయోగాలను చేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఇతర గ్రహాలపై ఏముంది అక్కడి పరిస్థితులు ఎలాంటో తెలుసుకునేందుకు ఉత్సుకతో ఉన్నాడు. అయితే.. ఇప్పటికే భూమి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న చంద్రుడిపై మానవుడి అడుగు పెట్టాడు. చంద్రుడిపై ఏముందో తేల్చేందుకు ఎవరికివారే కసరత్తులు చేస్తున్నారు. అయితే.. తాజాగా చైనాకు చెందిన షాంగ్‌ఈ-5 లూనార్ ల్యాండర్ ఈ విషయంలో మరో ముందడుగు వేసింది.

ఈ క్రమంలోనే ఆన్‌సైట్‌ నుంచి చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. షాంగ్‌ఈ-5 గతేడాది భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు తన వెంట తెచ్చిన శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీటిని సూర్యుడి వైపు ఉన్న చంద్రుడి భూభాగంపై 200 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ శాంపిల్స్‌ను సేకరించిందా ల్యాండర్. వాటిపై చేసిన పరిశోధనల ఫలితాలు కూడా లూనార్ ల్యాండర్ పంపిన ఫలితాలతో సరితూగినట్లు చైనా సైంటిస్టులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version