వయనాడ్ ఘటన ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వయనాడ్ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం వయనాడ్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముప్పు ప్రాంతంలో దాదాపు 416 మంది ప్రాణాలను కోల్పోయారని.. అందులో 47 మంది సీపీఐ నాయకులను కోల్పోవడం జరిగినట్టు తెలిపారు.
ఈ వయనాడ్ సందర్శన అనంతరం నాకు చాలా బాధకరంగా ఉంది అని తెలిపారు నారాయణ. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ వయోనాడ్ జిల్లాను సందర్శించారని గుర్తు చేసారు. ముప్పు ప్రాంతాలలో సందర్శించడం తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేవలం సందర్శనకే పరిమితమా..? లేక వారికి ఏమైనా చేసేది ఉందా..? అని ప్రశ్నించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎవ్వరూ ప్రమాదంలో ఉన్న ప్రధాని తప్పకుండా స్పదించాలని కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే అసలైన సహాయం అని పేర్కొన్నారు. ఇప్పటికే సీపీఐ దేశవ్యాప్తంగా వయనాఢ్ బాధితులకు సహాయం చేసేందుకు కృషి చేస్తుందన్నారు.