తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి : హరీశ్ రావు

-

తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి 56 లక్షల CMRF చెక్కులు పంపిణి చేసారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకి మోసం చేశాయి అన్నారు.

ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8 సీట్లు ఇస్తే.. తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది అన్నారు. బీజేపీకి ఆంధ్రా తీపి అయింది.. తెలంగాణ చేదు అయ్యిందా..? అని ప్రశ్నించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలిపోతే కాళేశ్వరం మొత్తం కూలి పోయిందని ప్రచారం చేశారు. ఒకవేళ కాళేశ్వరం కూలి పోతే రంగనాయక సాగర్ లో నీళ్లు ఎలా వచ్చాయని అన్నారు. సిద్దిపేట జిల్లా, గోదావరి జలాలు, రైలు, మెడికల్ కాలేజ్ అన్ని కేసీఆర్ తోనే సాధ్యం అయింది అని తెలిపారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version