సహజసిద్ధంగా రోగనిరోధకశక్తిని పెంపొందించుకునే మార్గాలు..

-

కరోనా మహమ్మారి కాలంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. రీసెర్చ్ ప్రకారం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్లలో కరోనా రిస్క్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అయితే సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి ఎలా పెంపొందించుకోవాలి అనేది ఈ రోజు మనం చూసేద్దాం..

రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఇవి అవసరం:

మూడు నుండి నాలుగు తులసి ఆకులు
మూడు నుండి నాలుగు కరివేపాకు ఆకులు
ఒక స్పూన్ తేనె

దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూస్తే..

ముందుగా కరివేపాకు ఆకుల్ని, తులసి ఆకుల్ని దంచుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని దానిలో ఒక స్పూన్ తేనె వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని మీరు రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మరీ మంచిది.

దీని వల్ల కలిగే ప్రయోజనాలు:

తులసిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, రెస్పిరేటరీ సమస్యలు తగ్గిపోతాయి. తులసి లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇటువంటి మహమ్మారి సమయంలో తులసి ఆకులు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు. మీరు కావాలంటే తులసిని మరిగించి దానితో టీ చేసుకుని కూడా తీసుకోవచ్చు.

కరివేపాకు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో కూడా ఆయుర్వేద గుణాలు ఉంటాయి కరివేపాకులో ఐరన్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటుంది.

ఇక తేనే గురించి చూస్తే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. శారీరక పరంగా మానసిక పరంగా అనేక బెనిఫిట్స్ దీని వల్ల మనకి కలుగుతాయి. ఇలా మూడిటిని తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు మీరు పొందవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version