సాధారణంగా గెలుపు, ఓటమి సహజం. ఒక్కొక్కసారి గెలుపు ఉండే మరొకసారి ఓటమిని ఎదుర్కోవలసి వస్తుంది. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఓటమిని కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్లాలి. అప్పుడే మరోసారి విజయం మీకు అందుతుంది. అయితే ఓటమిని ఎలా తట్టుకోవాలి…? అనే దాని కోసం చూద్దాం.
ఎమోషన్స్:
ఓటమి కలిగినప్పుడు మీకు బాధ, కోపం వంటి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఇలా బాధ పడడం లాంటివి చేసినప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలరు. దీని కారణంగా మీరు మరింత బాగా కష్ట పడటానికి సహాయపడతాయి. దీంతో మరోసారి ఏమైనా చేసినప్పుడు అది మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది.
తప్పులను కనుక్కోండి:
మీకు ఓటమి ఎందుకు వచ్చింది..? దానికి గల కారణాలు ఏమిటి….?, ఏం తప్పులు చేశారు…? వంటివి మీరు కనిపెట్టాలి. ఇలా కనిపెట్టినప్పుడు మీరు ఆ తప్పులు సర్దుకుంటే మరోసారి ఆ తప్పులు చేయకుండా ఉండడానికి వీలవుతుంది. దీంతో మరోసారి మీకు ఓటమి రాదు.
స్నేహితులతో మాట్లాడండి:
ఓటమి వచ్చింది అని బాధపడి పోకండి. మీ స్నేహితులతో మాట్లాడటం లేదా సరదాగా వాక్ చేయడం లేదా మీ పెంపుడు జంతువులతో ఆడుకోవడం లాంటివి చేసినప్పుడు మీకు దుఃఖం ఎక్కువగా ఉండదు.
మంచి ఆలోచనలు:
ఓడిపోతే జీవితం అయిపోయింది లాంటి నెగిటివ్ ఆలోచనలు కాకుండా నేను ఓటమిని భరించగలను, నేను ఓటమి నుండి నేర్చుకోగలను, నేను దీని కంటే ఎక్కువగా కష్టపడగలను, ఇలాంటివి మీకు మీరు చెప్పుకుంటే మరోసారి ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి వీలు అవుతుంది.