ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు మొత్తం 2 వేల 731 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన మూడు గంటల వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. తర్వాత సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగనుంది.
ఓవైపు పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ-సర్కార్ మధ్య వార్ జరుగుతుండగానే.. మరోవైపు మంగళవారం జరిగే పోలింగ్‌కు అన్ని సిద్ధం చేస్తున్నారు ఎన్నికల అధికారులు. తొలిదశలో 3 వేల 249 పంచాయతీల పరిధిలో 32 వేల 502 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మంగళవారం 2 వేల 731 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.
ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రేపే ఓట్ల లెక్కింపు చేపట్టి సర్పంచ్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసిన అధికారులు.. వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌కు ముందే పలు చోట్ల గొడవలు, ఘర్షణలతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి నిఘా పెట్టారు. స్పాట్…
ఎవరూ భయపడవద్దని.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచిస్తున్నారు. పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు బలవంతపు ఏకగ్రీవాలపై ఓ కన్నేసింది ఎన్నికల సంఘం. వాటిని అడ్డుకునేందుక ప్రణాళికలు రూపొదించింది. ఇక ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.