వరల్డ్ కప్ క్వాలిఫైర్ : వెస్ట్ ఇండీస్ VS నెదర్లాండ్ మ్యాచ్ డ్రా…

-

ఈ రోజు వెస్ట్ ఇండీస్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ నిర్ణీత ఓవర్ లలో వికెట్లను కోల్పోయి 374 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో బ్రాండన్ కింగ్ 76, చార్లెస్ 54, అర్ద సెంచరీలు చేయగా… నికోలస్ పూరం ఆకాశమే హద్దగా చెలరేగి ఆడి సెంచరీ సాధించాడు.. ఇతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు మరియు 6 సిక్సులు ఉన్నాయి. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన నెదర్లాండ్ అనూహ్యంగా, ఎవ్వరూ ఊహించని రీతిలో అన్ని ఓవర్లు ముగిసే సమయానికి వెస్ట్ ఇండీస్ చేసిన పరుగులు చేసింది. కానీ 9 వికెట్లను కోల్పోవడం విశేషం.

దీనితో ఈ మ్యాచ్ డ్రా అయింది. నెదర్లాండ్ లో తేజ నిడమానూరు అద్భుతంగా ఆడి సెంచరీ సాధించి తన జట్టు పరువును కాపాడాడు. ఇప్పుడు రెండు జట్లు కూడా సూపర్ ఓవర్ ను ఆడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version