జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా ఈ రోజు జింబాబ్వే అమెరికా తో తలపడింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 408 పరుగులు చేసింది. ఈ స్కోర్ లో జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ 174 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు కేవలం ఓవర్లు మాత్రమే ఆడి 104 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీనితో జింబాబ్వే 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ జట్టు కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడింది. స్వదేశంలో జింబాబ్వే ప్రతి మ్యాచ్ లోనూ అదరగొడుతోంది. గత మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ ను సైతం మట్టి కరిపించింది.
జింబాబ్వే అదరహో: వన్ డే చరిత్రలో రెండవ అతి పెద్ద విజయం…
-