ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ‘మేమంతా సిద్ధం’ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ…వైసీపీ హయాంలో ఇప్పటి వరకు రూ. 67,500 ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందించామన్నారు. రైతులకు మ్యానిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశామని పేర్కొన్నారు.
పంట నష్టం జరిగితే .. పరిహారాన్ని వెంటనే అందించామన్నారు. చంద్రబాబు ఎత్తేసిన సున్నా వడ్డీ రుణాన్ని అమలు చేశామని గుర్తు చేశారు.. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించామన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి.. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట కొనుగోలు వరకు రైతుకు అండగా ఉన్నామని వైఎస్ జగన్ అన్నారు. ఏ సీజన్ లో ఇన్ పుట్ సబ్సిడీని ఆ సీజన్ లో అందించాన్నారు. లంచాలు, వివక్షత, సంక్షేమ పథకాలు అందించి.. గ్రామాలను తీర్చే తీద్దామని ఆయన అన్నారు.