రైతు బీమా కొనసాగిస్తాం.. పంట బీమా కొత్తగా తీసుకువస్తున్నాం – మంత్రి జూపల్లి ప్రకటన

-

నిన్న బడ్జెట్ మీద 10 సంవత్సరాల అనుభవం ఉన్న కేసిఆర్.. ప్రభుత్వాన్ని బడ్జెట్ విషయంలో చీల్చి చెండడుతాం అని అన్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా స్పందించారు.కేసిఆర్ పదేళ్లలో వాస్తవిక బడ్జెట్ పెట్టలేదు.భట్టి విక్రమార్క మొదటి సారి బడ్జెట్ పెట్టిన.. మిలాగా గ్యాస్…స్ట్రాష్ బడ్జెట్ పెట్టలేదు అని అన్నారు. పది సంవత్సరాలు ఆదాయానికి మించి ఖర్చు చేస్తామని.. కేసిఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అని అన్నారు.మోసం చేయకుండా.. వాస్తవాలకు దగ్గరగా ఎంత వస్తె అంతే ఖర్చు చేస్తున్నాం అని మంత్రి జూపల్లి తెలిపారు. రైతులను నట్టేట ముంచుతున్నం అని కేసిఆర్ మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు.రైతు బంధు ఎత్తివేయలేదు కదా..?గతంలో ఇచ్చినదానికి ఎక్కడ,ఎది తగ్గించలేదు అని స్పష్టం చేశారు.

రైతులకు 31వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నాం ఎలా నట్టేట ముంచినట్లు అవుతుంది అని ప్రశ్నించారు.రైతు భీమ కొనసాగిస్తున్నాం.. పంట భీమ కొత్తగా తీసుకువస్తున్నాం అని తెలిపారు.క్వింటల్ కి 500 ల రూపాయల బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం.కేసిఆర్ తల తోక లేకుండా మాట్లాడుతున్నాడు అని..కేసిఆర్ మాటలతో ప్రజలను మబ్యపెట్టలని.. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ దొంగ అన్నట్లు కేసిఆర్,హరీష్ రావు పరిస్తితి ఉంది అని మేము తెచ్చిన అప్పులకన్న.. కేసిఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎక్కువగా తీర్చుతున్నాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news