బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు.కొత్తగా వచ్చే పంటకు కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లుగా రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ డిమాండ్ చేశారు.
‘ఏప్రిల్ 2న దీనిపై బీఆర్ఎస్ నేతలు అధికారులకు మెమోరాండాలు ఇస్తారు. ఏప్రిల్ 6న బోనస్ కోసం దీక్షలు చేస్తాం అని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం అని పిలుపునిచ్చారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలని చెబుతాం. ఈ అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసిఆర్ విజ్ఞప్తి చేశారు. రైతుల పక్షాన పోరాడాటానికి బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నారని భరోసానిచ్చారు. సాగు నీరు లేక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రజాస్వామయ్య పద్దతిలో ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు కేసిఆర్.