నేషనల్ హెరాల్డ్ స్కాం కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ చార్జిషీటులో చేర్చడంపై దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ఎదుట నిరసనలు తెలిపాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఏయ్ మోడీ.. బ్రిటిష్ వాళ్ళకే భయపడని పార్టీ రా మాది.. మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు.
మోడీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఏంటి రా? 2029లో మోడీని తన్ని జైల్లో వేస్తాం. RSS మోడీ లాంటి దరిద్రపు గొట్టు నాయకుడిని ఈ దేశానికి ఇచ్చింది. మోడీ మేము ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా? అని అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.