ఇథనాల్ ఫ్యాక్టరీ పై పునరాలోచన చేస్తాం : తెలంగాణ ప్రభుత్వం

-

దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ని రద్దు చేయాలంటూ  నాలుగు గ్రామాల ప్రజలు రెండు, మూడు రోజుల నుంచి ధర్నా కొనసాగించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఆర్డీవో ను నిర్బంధించగా, 600మంది పోలీసులు బందోబస్తుతో వెళ్లి గ్రామస్తుల అధీనం నుంచి బలవంతంగా ఆర్డీవోను విడిపించి ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం, పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులు ధర్నా కొనసాగిస్తున్నారు. దీంతో దిలావర్ పూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Telangana Govt

గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులను నిరసన కారులు ఎదురించడం.. ఇథనాల్ ఫ్యాక్టరీనా.. మేమా? ఏదో ఒకటే ఉండాలన్నట్లుగా భీష్మించడంతో వారికి సర్దిచెప్పలేక పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలీసుల మీద రాళ్ళు రువ్వుతూ, పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసనకు దిగారు. ఆందోళనకారుల్లో కొందరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు నిరసనల్లో ముందుండి పోరాడుతుండటంతో లా అండ్ ఆర్డర్ పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో గత ప్రభుత్వం పరిశ్రమకు ఇచ్చిన అనుమతి పై పునరాలోచన చేస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version