తెలంగాణ రాష్ట్రం విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘అభివృద్ధి కోసం వేదికలు పంచుకుంటాం అని అన్నారు. సంక్షేమంలో సమన్వయంతో పని చేస్తాం అని ,సమాఖ్య స్ఫూర్తిని గౌరవించడమే మా సిద్ధాంతం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం విషయంలో రాజీపడబోం.. ఆత్మగౌరవం విషయంలో తలెత్తుకునే ఉంటాం’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
కాగా, ఈరోజు ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఈ రోజుతో బయటపడిందని ఆరోపించారు. ‘నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే రేవంత్ రెడ్డి పొగిడారు. ప్రధాని మోదీ పెద్దన్న అని అలయ్ బలయ్ తీసుకున్నారు అని విమర్శించారు. మోదీని రేవంత్ ఒక్క మాట అనరు కానీ కెసిఆర్ పై ఒంటికాలితో లేస్తారు అని మండిపడ్డారు. మోదీ వద్ద రేవంత్ రెడ్డి మోకరిల్లడం ప్రజలంతా చూశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది’ అని ఆయన విమర్శించారు.