గిల్ క్రిస్ట్ , వార్నర్ వలె కమిన్స్‌ ఈ సారి మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తాడా..?

-

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది.ఇక ఈ ఐపీఎల్‌ సీజన్‌కు గాను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజ్… కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.  ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్‌ కమిన్స్‌ను సారథిగా నియమించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ వేలంలో ఏకంగా రూ. 20.50 సన్రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మార్క్‌రమ్‌ను ఐపీఎల్‌లో సారథిగా తప్పించి కమిన్స్‌కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. కమిన్స్‌ సన్‌రైజర్స్‌కు కెప్టెన్ గా వ్యవహరించబోతుండడంతో హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్లతో హైదరాబాద్‌ సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో ఇంతవరకు హైదరాబాద్‌కు 2 సార్లు టైటిల్ ను (ఒకసారి డెక్కన్‌ ఛార్జర్స్‌, మరోసారి సన్‌ రైజర్స్‌) అందించింది ఆసీస్ ప్లేయర్స్ మాత్రమే.

IPL 2024 Aus Pat Cummins SRH Captain

డెక్కన్‌ ఛార్జర్స్‌కు కెప్టెన్ గా ఉన్న ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ … 2009లో హైదరాబాద్‌కు ట్రోఫీని అందజేశాడు. ప్రస్తుతం టీమిండియా సారథి రోహిత్‌ శర్మ అప్పుడు డెక్కన్‌ ఛార్జర్స్‌ టీమ్‌ మెంబర్‌. ఆ సీజన్‌ తర్వాత హైదరాబాద్‌ అభిమానులు ఐపీఎల్‌ ట్రోఫీ కోసం ఏడేండ్లు వేచి చూడాల్సి వచ్చింది.ఏడు సంవత్సరాల తర్వాత మరో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ 2016లో సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ కి ట్రోపీని అందించాడు.వార్నర్‌ తర్వాత హైదరాబాద్‌కు మళ్లీ ఆస్ట్రేలియా ప్లేయర్ కమిన్స్‌ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టుతుండడంతో అతడు కూడా గిల్‌క్రిస్ట్‌, వార్నర్‌ ల మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తాడని హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. మరి కమిన్స్‌ ఆడం గిల్ క్రిస్ట్, డేవిడ్ వార్నర్‌ భాయ్‌ల బాటలో నడుస్తాడా..? అనేది త్వరలోనే తేలనుంది.

Read more RELATED
Recommended to you

Latest news