గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పని చేస్తాము : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

-

సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాపక్షపాతితో పనిచేస్తుందని తెలిపారు.

రాబోయే 5 సంవత్సరాలలో ప్రజల్లో మంచి ప్రభుత్వం అనిపించు కునేలా వ్యవహరిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం లాగా దాడులు చేసే సంస్కృతీ తమకు లేదని అన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఒకటో తేదీనే రూ.65 లక్షల పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. వైసీపీ నిరుద్యోగుల పొట్ట కొట్టిందని మండిపడ్డారు.టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా డీఎస్సీ విడుదల చేసి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. స్మగ్లర్లను యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను ప్రోత్సాహంచే ప్రసక్తే లేదని ,ప్రాజెక్ట్‌లను త్వరగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం పోలవరం పనులను పరిశీలించారని అన్నారు.గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పని చేస్తామని.. రైతు భరోసా కేంద్రాలు చివరి క్షణాల్లో నిర్మించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news