క్యాడర్ కోసం జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవేనా..?

-

వైసీపీ ఓటమి తరువాత పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న అధినాయకత్వం ఎం చేయాలన్నది ఆలోచన చెస్తోంది. ఎందుకు ఓటమి పాలు అయ్యామని చూస్తే అనేక రకాలైన కారణాలు కళ్ల ముందు ఉన్నాయి. అయితే అన్నింటినీ పరిగణనలోకి తీసుకునేందుకు అధినాయకత్వం సిద్ధంగా ఉందా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకు అంటే కొన్ని కఠినమైన వాస్తవాలు ఉన్నాయి. అవి అంత తేలిగ్గా జీర్ణించుకోలేనివి. ఇక్కడ అదే జరుగుతోంది. అధినాయకత్వానికి క్యాడర్ కి మధ్య గత అయిదేళ్లుగా అతి పెద్ద గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ అన్నది భర్తీ చేయడానికి కూడా వీలు లేనంత అగాధంగా మారింది.

దానికి కారకులు ఎవరు అంటే అధినాయకత్వం అని రెండవ మాట లేకుండా చెబుతున్నారు. ఎక్కడైనా పార్టీని క్యాడర్ ని పట్టుకుని నడిపించాల్సిన అధినాయకత్వం గత అయిదేళ్ళుగా ఉదాశీనంగా వ్యవహరించింది. క్యాడర్ బేస్డ్ పార్టీగా కాకుండా కొత్త ప్రయోగాలు చేస్తూ పోయింది. మధ్యలో వాలంటీర్లను జొప్పించింది. వారే తమకు వారధులూ సారధులూ అని భావించింది. చివరికి కొత్తగా మధ్యలో వచ్చిన వాలంటీర్లు మధ్యలోనే పోయారు క్యాడర్ ఆశలు చిత్తు అయి పక్కకు పోయింది. దాంతోనే వైసీపీ ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇపుడు ఏమిటి కర్తవ్యం అంటే క్యాడర్ ని దగ్గర చేయడమే అని అంటున్నారు. క్యాడర్ ని ముందుకు తీసుకుని నడిపించకపోతే ఇబ్బంది అని అంటున్నారు.

అయితే ఇపుడు క్యాడర్ ని దగ్గర తీసుకుంటే వారు వస్తారా అంటే అది అంత సులువుగా జరిగే పని కాదనే అంటున్నారు. వారు బాగా హర్ట్ అయి ఉన్నారు. దాంతో వారిని సముదాయించాలి. పార్టీ మీదే అని చెప్పాలి, మీకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలి. ఇదంతా జగన్ బయటకు వచ్చి చెప్పాలని అంటున్నారు. క్యాడర్ విషయంలో కొన్ని తప్పులు జరిగాయని జగన్ బాహాటంగా చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు. దాని కంటే ముందు భారీ స్థాయిలో క్యాడర్ తో సమావేశం ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ లో వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు క్యాడర్ తో ఇక కలసి పనిచేద్దాం, జరిగిందేదో జరిగిపోయింది. మీకూ నాకూ మధ్యలో ఎవరూ లేరు. మీర నాకు సారధులు వారధులు అని జగన్ చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.

అయితే జగన్ ఆ మాట చెబుతారా అని అంటున్న వారూ ఉన్నారు. జగన్ తో సహా పార్టీ పెద్దలు అయితే జనాలే ఓడించారు తప్ప తామేమీ తప్పు చేయలేదని భావిస్తున్నారు. వారంతా ఇంకా అదే భ్రమలలో ఉన్నారని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున డిజాస్టర్ గా ఎన్నికల్లో వైసీపీకి ఫలితం వస్తే కూడా తప్పులు లేవని తప్పుకోవడం సరి కాదు అనే అంటున్నారు దానికి బదులుగా ఓపెన్ గా మాట్లాడుతూ జరిగిన తప్పులను గుర్తించామని ఇక మీదట పొరపాట్లు జరగనీయమని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే… వైసీపీకి పూర్వ వైభవం రావాలీ అంటే జగన్ క్యాడర్ తో గ్యాప్ ని తగ్గించుకోవాల్సిందే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news