ఉరి తీసిన తాడుతో, చేసిన లాకెట్ ధరిస్తే, అద్రుష్టమట…!

-

నిర్భయ దోషులను ఉరి తీయడానికి గానూ ఢిల్లీ హైకోర్ట్ డెత్ వారెంట్ జారి చేసిన సంగతి తెలిసిందే. కోర్ట్ ఆదేశాలతో నలుగురు నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్‌ని తీహార్ జైల్లోనే అధికారులు ఉరి తీయబోతున్నారు. వారు నలుగురికి ఒకేసారి శిక్ష అమలు కానుంది. నిర్భయ దోషులను పవన్ అనే తలారి ఉరి తీస్తారని తెలుస్తుంది. ఇప్పటికే వారిని ఉరి తీసే తాళ్ళను కూడా అధికారులు సిద్దం చేసారు.

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఉరి తీసిన తాళ్ళ గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. బెంగాల్ కి చెందిన నటా మాలిక్ దాదాపు 25 మందిని ఉరి తీసాడు. అతనికి బెంగాల్ ప్రభుత్వం నెలకు 10 వేలు జీతం ఇచ్చేది. ఉరి తీసిన ప్రతీసారి 5 నుంచి పది వేల వరకు భత్యం ఇచ్చేవారు అధికారులు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఆయన ఉరి తీసిన ప్రతీసారి తాడుని ఇంటికి తీసుకువెళ్ళే వాడు.

దానితో మంచి ఆదాయ౦ అతనికి వచ్చేది. దాన్ని ఎం చేసుకుంటారు అంటారా…? ఉరి తాడు నిబంధనల ప్రకారం 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఉరితీసిన తర్వాత ఆ తాడును ఇంటికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలు చేసి దానితో అందమైన లాకెట్‌లను తయారు చేసి మార్కెట్లో విక్రయించే వాడు. ఉరితాళ్లతో చేసిన లాకెట్లను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందని బెంగాలీలు నమ్ముతారట. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ లాకెట్లు వేసుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడతారని వాళ్ళ నమ్మకం. ఒక్కో లాకెట్‌ను నటా మాలిక్ రూ.2వేలకు అమ్ముకునేవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version