తెలుగు సినిమా పరిశ్రమ ని లాక్కునే ప్రయత్నం లో మోడి ?

-

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా తమ దృష్టి పెట్టేది తెలుగు సినిమా పరిశ్రమ మీదనే.. ఎప్పుడూ సినిమా ల మీద ప్రేమతో అందరూ థియేటర్ లకి ఎగబడుతూ ఉంటారు. తమిళనాడు తరవాత అంతగా సినిమా పిచ్చి ఉన్న రాష్ట్రాలు తెలుగు వారివే కావడం విశేషం.

 

అయితే పోలిటికల్ జనాలు ఎల్లప్పుడూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు , సినిమా పరిశ్రమ మనకి సపోర్ట్ ఇస్తే జనం కూడా మనకి సపోర్ట్ ఇస్తారు కదా అన్నట్టు ప్రవర్తిస్తారు.. రెండు తెలుగు రాష్ట్రాలూ విడిపోయి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తెలుగు పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ వైపు వెళ్లలేదు. తెలంగాణ లోనే ఉంది.. కే‌సి‌ఆర్ పాలన లో సినిమా వాళ్ళకి చాలా బెనిఫిట్ లు రావడమే కాకుండా కేటీఆర్ కూడా సినిమా వాళ్ళకి చాలా దగ్గర మనిషిగా ఉంటారు. ఈ కారణాలు మాత్రమే కాకుండా అన్నిటికీ సౌలభ్యంగా ఉండే హైదరబాద్ ని దూరం చేసుకోవడం సినిమా వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పచ్చు.

 

 

మొదటి నుంచీ ఎన్నో సంవత్సరాలు గా ఇక్కడ స్థిరపడిన సినిమా వారు ఎక్కడికీ వెళ్లడానికి ఆసక్తి అస్సలు చూపించడం లేదు. అనేకానేక స్టూడియో లతో పాటు సినిమా షూటింగ్ ల స్పాట్ లకి కూడా హైదరబాద్ బెస్ట్ ప్లేస్ గా ఉంది. సొ ఇప్పుడు మోడి కన్ను హైదరబాద్ లోని చిత్రపరిశ్రమ మీద పడింది అంటున్నారు. మా అసోసియేషన్ లో రీసెంట్ గా జరుగుతున్న గొడవలకి ఇన్ డైరెక్ట్ సంబంధాలు బీజేపీ తో ఉన్నాయి అనే ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి.

 

 

టి‌ఆర్‌ఎస్ కి బలంగా నిలబడిన తెలుగు సినిమా వర్గం మొత్తాన్నీ తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది అనీ అందులో భాగంగానే మోడి కి సైరా సినిమా చూపించే ఆహ్వానం చిరు కి వచ్చింది అని , మోహన్ బాబు రీసెంట్ గా మోడి ని అమిత్ షా ని కలిశారు అని అంటున్నారు. టి‌ఆర్‌ఎస్ బలం తో నిలబడిన సినిమా పరిశ్రమ ని వారినుంచి దూరం చెయ్యాలి అనే ప్లాన్ ల్లో బీజేపీ ఉంది అంటున్నారు. సినిమా ఇండస్ట్రి వారి మీద ఐటీ దాడులు ఎప్పుడు మొదలు అయ్యాయో అప్పటి నుంచే ఈ కార్యక్రమం షురూ అయ్యింది అనే వాదనా ఉంది. తెరాస కు సఖ్యతగా ఉన్న సిని పరిశ్రమను దూరం చెయ్యాలని. బీజేపీ కి అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది . దీన్ని టి‌ఆర్‌ఎస్ ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version