చిన్న సినిమాలకు ఎర్త్‌ పెడుతోన్న వెబ్‌ సిరీసులు…!

-

చిన్న హీరోలని ఎవరూ పట్టించుకోట్లేదు, చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా ఉందనే కామెంట్స్‌ చాన్నాళ్లుగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌ తర్వాత ఈ చిన్న సినిమాలు మరింత ప్రమాదంలోకి వెళ్తున్నాయనే టాక్ వస్తోంది. కోవిడ్‌తో ఇండస్ట్రీలో ఎక్కువగా చిన్న సినిమాలే ఎఫెక్ట్‌ కాబోతున్నాయట. కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతబడ్డాక ఆడియన్స్‌కి ఓటీటీ లార్జెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ ఫామ్‌గా మారిపోయింది. వరల్డ్‌ క్లాస్‌ కంటెంట్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. యూత్‌ అయితే వెబ్‌ సీరీస్‌లకి అడిక్ట్ అయిపోయారు. ఇలాంటి ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడం చిన్న సినిమాలకు పెద్ద సవాల్‌ అంటున్నారు విశ్లేషకులు.

డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో సినిమా కంటెంట్‌ పెరిగాక, థియేటర్‌ ఆడియన్స్‌ తగ్గిపోయారు. ఎంత పెద్ద సినిమా అయినా ఒకటి రెండు వారాలకే ముగిసిపోతోంది. ఇక చిన్న సినిమాలకు అయితే సూపర్‌ హిట్‌ టాక్ వస్తేనే టిక్కెట్లు తెగుతున్నాయి. యావరేజ్‌ టాక్‌ వచ్చినా పట్టించుకోట్లేదు. అందుకే రాజ్‌తరుణ్‌ లాంటి చిన్న హీరోలకు టఫ్‌ సిట్యువేషన్స్‌ ఎదురుకాబోతున్నాయి అంటున్నారు సినీజనాలు.

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. 50 పర్సంట్‌ ఆక్యుపెన్సీతో షోస్‌ స్టార్ట్ చేశాయి. కానీ ప్రేక్షకులు మాత్రం సినిమా హాళ్లవైపు చూడట్లేదు. కరోనా భయంతో థియేటర్ల వైపు వెళ్లడమే మానేస్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్‌లో చిన్న సినిమాలు రిలీజైతే, కరెంట్‌ ఛార్జీలు కూడా రావడం కష్టమే అంటున్నారు ఎగ్జిబిటర్లు. చిన్న హీరోల్లో ఇప్పుడు ఎవరూ ప్రామినెంట్‌ స్టార్స్‌ కనిపించట్లేదు. లోబడ్జెట్‌ మూవీస్‌కి మినిమం గ్యారెంటీ హీరో అని చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్‌. ఇలాంటి హీరోలు బరిలో దిగుతున్నారంటే ఎవరికి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండవు, ఓపెనింగ్స్‌ కూడా కష్టమైపోతుందని చెప్తున్నారు.

టాలీవుడ్‌లో చాలామంది చిన్నహీరోలు ఉన్నారు. అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, సుశాంత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఇలా బోల్డంతమంది ఉన్నారు. కానీ వీళ్లలో ఒక్కళ్లకి కూడా మినిమం గ్యారెంటీ హీరో అనే ఇమేజ్‌ లేదు. దీంతో బిజినెసులు పెద్దగా జరగట్లేదు. ఓపెనింగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.ఆడియన్స్‌ లార్జ్‌ స్కేల్‌ సినిమాలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రమే భారీ బిజినెసులు, అడ్వాన్స్‌ బుకింగుల హంగామా ఉంటుంది. అదే చిన్న సినిమాలకి అయితే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే టాక్‌ వస్తేనే, టిక్కెట్లు తెగుతున్నాయి. లేకపోతే లైట్‌ తీసుకుంటున్నారు ప్రేక్షకులు. వెబ్‌సీరీస్‌లకి సెన్సార్‌ ఉండట్లేదు. రా కంటెంట్‌ని చూపిస్తున్నారు. దీంతో సీరీస్‌లకి ఆడియన్స్‌ పెరిగిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news