వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజు స్థానిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికలు సక్రమంగా జరగకుండా.. అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లపై వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అసంతృప్తిని మరియు ఆవేదనను తెలియచేశాడు. ఈయన మాట్లాడుతూ ఎన్నికలు మాములుగా బ్యాలెట్ లతో జరగాలి.. కానీ బులెట్ ల ద్వారా కాదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రజాస్వామ్యానికి గుర్తుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉందని, మరియు ఎన్నికలు జరిగే రోజు పవిత్రమైనదని తెలిపారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఎన్నికలో అల్లర్లు, రక్తపాతం, ఈ హింస ఏమిటంటూ బాధపడ్డారు. తక్షణమే ఈ హింసను ఆపాలని పార్టీలను మరియు నేతలను గవర్నర్ బోస్ కోరారు.
ఎన్నికలు బ్యాలెట్ లతో జరగాలి.. బులెట్ లతో కాదు: వెస్ట్ బెంగాల్ గవర్నర్
-