వామ్మో.. నరేష్ ఆస్తి అన్ని కోట్లా.. అందుకే ఇదంతా చేస్తున్నారా..?

-

వీకే నరేష్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన పేరు హార్ట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే తన మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడని.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆయన భార్య రమ్య రఘుపతి పెద్ద ఎత్తున మీడియా ముందు రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోని అటు నరేష్ ఇటు పవిత్ర మరొకవైపు రమ్య రఘుపతి కూడా నెట్టింట బాగా హాట్ టాపిక్ గా మారారు.అంతేకాదు టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అతిపెద్ద హార్ట్ టాపిక్ కూడా వీళ్లే కావడం గమనార్హం. మొన్నటి వరకు తెలుగు మీడియాలో మాత్రమే వీరిద్దరి గురించి రకరకాల ప్రచారాలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు కన్నడ మీడియాలో కూడా వీరు ముగ్గురు హాట్ టాపిక్ గా నిలవడం వైరల్ గా అనిపిస్తుంది..

ఇకపోతే రమ్య రఘుపతి తన నుంచి డబ్బు తీసుకోవడం కోసమే ఇలా తనపై రూమర్స్ సృష్టిస్తుందని తాను నన్ను ఏమి చేయలేదంటూ.. మైసూర్లో ఒక హోటల్ నుంచి పవిత్ర లోకేష్ తో బయటకు వచ్చిన నరేష్ మీడియా ముందు వెల్లడించారు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా నరేష్ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉంది కాబట్టి ఆయన దగ్గర ఉన్న డబ్బు కోసమే వారు ఇదంతా చేస్తున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత అయినటువంటి విజయనిర్మల కుమారుడు నరేష్ అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈయన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అంతేకాదు మా అసోసియేషన్ కు అధ్యక్షత పదవిని కూడా చేపట్టారు. నరేష్ దాదాపు 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న ఈయన దగ్గర ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఆస్తి ఉంటుందని సమాచారం. అంతేకాదు ఖరీదైన కార్లతో పాటు నాలుగు కాస్ట్లీ కార్లు కూడా ఆయన ఇంటి దగ్గరే ఉంటాయట. ఇక ఇటీవల ఖరీదైన స్పోర్ట్స్ కారుతో పాటు రూ.5 కోట్ల విలువ చేసే క్యారవాన్ కూడా ఆయన సొంతం చేసుకున్నారు.

ఇక హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో ఇల్లు , ఫ్లాట్లు, ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. ఇక ప్రతి సినిమాకు రూ.50 లక్షల వరకు పారితోషకం తీసుకుంటారు. తన దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు అలా చేస్తున్నారు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version