దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే : మంత్రి జగదీష్ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి పథకం దళితబంధు. ఈ పథకం ప్రకటన నుంచి విమర్శలు ఎదుర్కొంటునే ఉంది. అయితే తాజాగా నల్గొండ జిల్లాలో లబ్దిదారులకు దళితబంధు పథకం ద్వారా 45 మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే వాహనాలను మంత్రి జగదీశ్‌ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దళితుల ఆత్మగౌరవం ఇనుమడింప చేస్తుందని పేర్కొన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని రూపొందించారని, ఉద్యమ కాలంలోనే కేసీఆర్‌ ఈ బృహత్తర ప్రణాళికకు అంకురార్పణ చేశారని తెలిపారు మంత్రి జగదీశ్‌ రెడ్డి.

అది నేడు అమలులోకి వచ్చిందన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి.. ఆర్థిక అసమానతలను రూపు మాపడంతో పాటు ఈ పథకం దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలకనుందన్నారు. గాంధీజీ మొదలు తొలి ప్రధానిజవహర్ లాల్ నెహ్రు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్ అంబేద్కర్‌ కన్న కలలు ఈ పథకంతో సాకమవుతున్నాయన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. గడిచిన 75 ఏండ్లుగా కొంత ప్రయత్నం జరిగినప్పటికి ఆశించిన మేర ఫలితాలు రాలేదన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. ఈ క్రమంలో నే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి పై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version