హైడ్రామా: ఇంకా ఎంట్రీ లేనట్లే రఘురామ!

-

ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటనకు సంబంధించి వార్తలు గాని, కథనాలు గాని పెద్ద ఎత్తున వస్తుంటే…మరో వైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టాపిక్ సైతం ఓ రేంజ్ లో హైలైట్ అవుతుంది. తెలంగాణలో మోదీ పర్యటన పై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఏపీలో మోదీ పర్యటనని అన్నీ పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఏదో కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్ప..ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనల నుంచి మోదీ పర్యటనకు మద్ధతు ఉంది.

దీంతో ఏపీలో మోదీ పర్యటన విషయంలో పార్టీల మధ్య వార్ లేదు…కానీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయమే బాగా హైలైట్ అవుతుంది…ఇప్పటికే రఘురామ, వైసీపీ సర్కార్ ల మధ్య వార్ నడుస్తోంది. అలాగే రఘురామ ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు…ఇక ఢిల్లీ నుంచి ఏపీకి వస్తే రఘురామని అరెస్ట్ చేయాలని వైసీపీ చూస్తుంది. ఈ క్రమంలోనే నరసాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరంలో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ప్రారంభించనున్నారు.

ఇక తన సొంత పార్లమెంట్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని రఘురామ అనేక విధాలుగా ట్రై చేశారు…కానీ ఎక్కడకక్కడే రఘురామకు వైసీపీ ప్రభుత్వం పర్మిషన్ రానివ్వలేదు. చివరికి ట్రై ఎక్కి భీమవరం వచ్చేందుకు రఘురామ చూశారు…కానీ ప్రోటోకాల్ ప్రకారం పీఏంఓ జాబితాలో రఘురామ పేరు లేదు…పైగా రఘురామ అనుచరులని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మధ్యలోనే రఘురామ ట్రై దిగేసి వెనక్కి వెళ్ళిపోయారు.

ఈ తనని రానివ్వకుండా చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని రఘురామ, మోదీకి లేఖ రాశారు. అయితే ఊహించని హైడ్రామా మధ్య రఘురామకు ఏపీలో ఎంట్రీ దొరకలేదు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా రఘురామకు ఏపీలో ఎంట్రీ దొరికేలా లేదు. ఎన్నికల ముందే ఇంకా రఘురామకు అడుగుపెట్టాల్సిన పరిస్తితి..మరి అప్పుడైనా రఘురామకు ఏపీలో ఎంట్రీ దొరుకుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version