వామ్మో ..ఆయన కోసం రూ.100 కోట్ల ఆఫర్ ను పక్కకు పెట్టేసిన రాజమౌళి..!

-

దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి గురించి.. ఆయన తెరకెక్కించే సినిమాల గురించి.. క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి సాధారణ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలోనే బాహుబలి సినిమా తీసి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చేసింది కేవలం 12 , 13 చిత్రాలే అయినా ప్రపంచం మెచ్చిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే ఏ రేంజ్ లో ఆ సినిమాలను పాపులారిటీ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మంచి రికార్డు సొంతం చేసుకోవడమే కాకుండా భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఆస్కార్ వరకు వెళ్లిన ఈ సినిమాతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అందుకే పలువురు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయట. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమాను కమిట్ అయిన రాజమౌళి ప్రస్తుతానికి ఏ ఒక్క ఆఫర్ ని అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోని ఏకంగా రూ.100 కోట్ల ఆఫర్ ను తిరస్కరించాడట. అసలు విషయం ఏమిటంటే నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా రూ.100 కోట్ల ఆఫర్ తో రాజమౌళి ముందుకు వచ్చారట. ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఇందుకోసం రాజమౌళి కోరినంత బడ్జెట్ కూడా ఇవ్వడానికి వారు ఓకే చెప్పారు. అంతటి ఆఫర్ ని కూడా రాజమౌళి తిరస్కరించారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు కోసమే ఇలా రూ. 100 కోట్ల ఆఫర్లు కూడా తిరస్కరించారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత ఏదైనా ప్రాజెక్ట్ అన్నట్లుగా రాజమౌళి తన వద్దకు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా పక్కకు నెట్టి వేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news