వ్యాపారాలు చేసి నష్టపోవడం కన్నా కూడా ఉద్యోగాలు చెయ్యడం మేలు అని చాలా మంది భావిస్తున్నారు.. అందుకే చిన్న ఉద్యోగం అయిన కూడా ఉద్యోగం చేస్తారు..అయితే ఓ దేశం ఉద్యోగంకు సెలవు పెట్టి వ్యాపారాలు చేసుకోండి.. మీకు జీతాలు కూడా ఇస్తామని చెప్పింది.. ఇది నిజంగా థ్రిల్ గా ఉంది కదా.. మీరు విన్నది నిజమే.. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని వ్యాపారం చేయడానికి భయపడతారు. అలాంటి వారి కోసం యూఏఈ ప్రభుత్వం అదిరిపోయే అవకాశాన్నిస్తోంది.
వాళ్లు ఉద్యోగం వదులుకోకుండానే తమ కలను నిజం చేసుకునే ఆఫర్ ప్రకటించింది. ఏడాదిపాటు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ లీవ్ ప్రకటించింది. ఉద్యోగం చేయకుండానే నెలనెలా జీతం తీసుకుంటూ వ్యాపారం చేసుకోండంటూ గుడ్ న్యూస్ చెప్పింది.బిజినెస్ లో సక్సెస్ అయితే ఒకే.. కానీ ఫెయిల్ అయితే మాత్రం మీ ఉద్యోగం మీకు ఉంటుంది అంటూ ఆఫర్ ను ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వివరించారు. సెలవు పెట్టిన ఏడాదిలో నెలనెలా సగం జీతం ఇస్తామని చెప్పారు. ఈ సెలవును వినియోగించుకోవాలనుకునే వారు ఆ సంస్థ వెబ్ సైట్ లో ముందుగా ధరఖాస్తు చేసుకొవాలని కోరింది.. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ యూఏఈ కీలక ప్రకటన చేసింది.. ఇలాంటి ఆఫర్ మనకు వుంటే బాగుండు కదా.. అక్కడ ఉద్యోగులు కూడా వారి ఆఫర్ ను స్వీకరిస్తున్నారు.. హర్షం వ్యక్తం చేస్తున్నారు… దేనికైనా రాసి పెట్టి ఉండాలి..