ఉరుకుల, పరుగుల జీవితం.. అస్తవ్యస్తమైన జీవన విధానం.. అనారోగ్య సమస్యలు.. ఒత్తిడి.. ఆందోళన.. తదితర అనేక కారణాల వల్ల నేటి తరుణంలో చాలా మంది నిత్యం టైముకు భోజనం చేయడం లేదు. సమయం తప్పించి భోజనం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం మానేయడమో, మధ్యాహ్నం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడమో చేస్తున్నారు. దీంతో స్థూలకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎవరైనా సరే.. నిత్యం టైముకు భోజనం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. ఎవరైనా సరే.. నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేయాలి. మరి ఆయా భోజనాలను ఏయే సమాయాలలోగా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
బ్రేక్‌ఫాస్ట్
ఉదయం నిద్రలేచాక 30 నుంచి 60 నిమిషాల్లోగా బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది.
లంచ్
మధ్యాహ్నం 1 గంట లోపు భోజనం పూర్తి చేయాలి. బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
డిన్నర్
రాత్రి పూట 7 గంటల లోపు భోజనం పూర్తి చేయాలి. రాత్రి భోజనానికి నిద్రకు మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ సమయాల్లోగా భోజనం చేయడం పూర్తి చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.