ఆరోదశ లోక్‌సభ ఎన్నికలు ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో (యూటీలు) జరగనున్నాయి. అయితే ఆరోదశ ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం శనివారం తెలిపింది. కాగా ఆరో విడత ఎన్నికలు ఈనెల 25వ తేదీన జరుగుతున్నాయి.వీరిలో జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో వాయిదా వేసిన ఎన్నికలకు 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆరో దశలో మొత్తం 58(వాయిదా పడిన జమ్మూకశ్మీర్ ఒక స్థానంతో కలిపి) నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఆరో విడత ఎన్నికల్లో 1,978 నామినేషన్లు దాఖలు అవ్వగా,పరిశీలన అనంతరం 900 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి.వీటిలో అత్యధికంగా యూపీలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 470 నామినేషన్లు, హర్యానాలోని 10 నియోజకవర్గాల్లో 370 నామినేషన్లు ,జార్ఖండ్‌లోని రాంచీ పార్లమెంటరీ సీటుకు అత్యధికంగా 70 నామినేషన్లు, నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి 69 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ పేర్కొంది.