తులసి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను పుస్కాలంగా కలిగి ఉంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.రాత్రి పూట కొన్ని తులసి ఆకుల్ని ఒక గ్లాసు నీటిలో వేసి ఉదయాన్నే ఆ నీటితో నోరు పుక్కలించటం వల్ల నోటి దుర్వాసన,నోటిలో ఏర్పడే పుండ్లు, నోటి పూత తగ్గుముఖం పడతాయి.అలాగే దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.
వాతావరణం మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గులకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.కొన్ని తులసి ఆకులను నీళ్లలో వేసి,వేడి చేసి దానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు సమస్యలతో పాటు గొంతు నొప్పి,గొంతు ఇన్ఫెక్షన్లను నివారించుకొనవచ్చు.తులసి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంది. సాధారణంగా వచ్చే జ్వరాలను తగ్గించడానికి తులసి నీటి సేవలను అత్యంత ప్రయోజన కారి అని చెప్పవచ్చు. తులసి నీటిని తీసుకోవడం వల్ల జ్వరం మరియు శరీర వేడిని తగ్గించుకోవచ్చు.
రక్తంలోని కొలెస్ట్రాలను తగ్గించడంలో తులసి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లక్షణాలు శరీరాన్ని ఫ్రీరాడికల్స్ భారీ నుండి కాపాడి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.అలాగే అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.తాజా అధ్యయనాల ప్రకారం రక్తంలోనూ చక్కెర నిల్వలను తగ్గించే గుణం తెలిసిన ఉందని తెలిసింది. తులసి నీరుని క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు తీసుకున్నట్లయితే కిడ్నీలో ఏర్పడే రాళ్లు సైతం కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే యూరినరీ ట్రాక్ ను క్రమబద్ధీకరించి మూత్ర సంబంధిత వ్యాధులను న్యాయం చేసే శక్తి తులసిలో ఉంది.