గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తనకు పార్టీలో విలువ లేదని, తనను ఎవరూ కేర్ చేయడం లేదని, జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో తను ప్రతిపాదించిన వ్యక్తుల పేర్లను కాదని ఇతరులను ఎంపిక చేయడంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు.
ఇదే విషయంపై ఆయన బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తన మాటకు విలువ నివ్వకపోతే పార్టీ రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తానని రాజాసింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ఉదయం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ..రాజాసింగ్‌కు పార్టీలో అన్యాయం జరిగింది అనేది ఆయన అంతర్గత విషయం.దానిపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని బండి క్లారిటీ ఇచ్చారు.