అవి రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, ఇన్నాళ్ళు ముళ్ళ కంచెలు ఎందుకు పెట్టావ్ ? ఎందుకు ప్రజలకు దూరంగా దాచి పెట్టావ్ ? ఎందుకు కోర్టులని మభ్య పెట్టావ్ ? ఇన్నాళ్ళు టూరిజం భవనాలు అని చెప్పి, ఇప్పుడు దొరికిపోయాక రాష్ట్రపతి భవనం, ప్రధాన మంత్రి భవనం అని కధలు ఎందుకు చెప్తున్నావ్ ? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలు అయితే, మీ జగన్ రెడ్డి భార్య తరుపు బంధువులు వెళ్లి, అక్కడ ఎందుకు ప్రార్ధనలు చేసారు ? అని వైసిపి పార్టీని నిలదీసింది.
చంద్రబాబు గారు విశాఖకి ఏమి చేసారో ప్రజలకు తెలుసు, మీరు ఎంత ప్రమాదకరమో కూడా విశాఖ ప్రజలకు తెలుసు. అందుకే మీ సైకోలని విశాఖ ప్రజలు ఒక్కసారి కూడా గెలిపించ లేదు. బీచ్ వ్యూ ప్యాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా నిబంధనలన్నీ ఉల్లంఘించి, వందల కోట్ల ప్రజాధనం తగలేసి, ఇప్పుడు వచ్చి కథలు చెప్తావా ? అయినా ఆ బాత్ రూమ్ ఏంటి జగన్ , అంత పెద్దగా ఉంది ? అసలు ఏమి ప్లాన్ చేసావ్ ? ఎవరికి స్కెచ్ వేశావు? అని అంటూ సెటైర్లు వేసింది.
కాగా, రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు అని వైసీపీ తెలిపింది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం అని వైసీపీ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది.