వాలంటైన్ డే రోజున మీ ప్రియమైన వారికి ఏం గిఫ్ట్‌ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా.?

-

వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది..చాలామందికి ఇదే వారి మొదటి వాలంటైన్స్ డే కావొచ్చు..మరికొంత మందికి..ఏ రెండోదో మూడోదో పదోదో కూడా కావొచ్చు..వాళ్లకు అది ఎన్నో వాలంటైన్స్ డే అయినా..ప్రియమైన వారి మీద ప్రేమ తగ్గదు. ఆ రోజుకు గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలని తాపత్రయం ప్రతి ప్రేమికుడిలో ఉంటుంది. ప్రేమికుల రోజు గిఫ్ట్ ఇవ్వడం అంటే..అబ్బాయిు జేబు కాళీ చేయించడం అని కొందరు అంటారు..అలాగే అమ్మాయి డబ్బు ఖర్చుపెట్టడం అని కూడా కొందరు అనుకుంటారు. అసలు ప్రేమలో పడితే ఒకరికొకరు గిఫ్ట్ లు ఎందుకు ఇచ్చిపుచ్చుకుంటారో తెలుసా..పైసలు వదిలించుకోవడం అని మాత్రం అనుకోకండి..దాని వెనుక పెద్ద కారణమే ఉంది.

మనకు ఇష్టమైన వారి నుంచి వచ్చే వస్తువు చిన్నదైనా, పెద్దదైనా..అది ఇచ్చిన వ్యక్తి వల్ల దాని విలువ పెరుగుతుంది. ఆ వస్తువును చూసిన ప్రతిసారి నువ్వు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది అనుకుంటారు. అవును..మన ప్రేమకు గుర్తుగా ఈ గిఫ్ట్ ఇలా అనుకునే ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది గిఫ్ట్స్ ఇవ్వడం వెనుకు ఉన్న కారణం..అలాగే మనం ఇచ్చే గిఫ్ట్ లు రెండు రకాలు తీసుకోవాలి..ఒకటి గుర్తుగా ఇస్తున్నారా..రెండు అవసరం ఉన్నది ఇస్తున్నారా..మీ లవర్ కు ఏదైనా ఇష్టమైనది ఉండి ఉంటుంది..అది వివిధ కారణాల వల్ల కొనుక్కోలేకపోయి ఉండొచ్చు..అలాంటివి మీరు ఇస్తే..వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డైలీ వాళ్లతో ఉంటారు కాబట్టి..తనకు ఏం కావలి..ఏది అవసరం అనేది మీకు తెలుస్తుంది..అలా తెలుసుకుని గిఫ్ట్ ఇవ్వటం ఒక పద్దతి..గుర్తుగా ఇస్తున్నారంటే..ఏదో ఒక క్రియేటివ్ ఆల్భమ్ లాంటివి ఇస్తే బెడ్ రూంలో పెట్టుకుంటారు ఇది రెండో మెథడ్.

మీ ప్రియమైన వారికి వాలంటైన్స్ డే సందర్భంగా ఏ గిఫ్ట్ (Gift) ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే.. ఈ ఐటెమ్స్ పై ఓ లుక్కేయండి. రూ. 5,000లోపు మీ బడ్టెట్ అయితే..వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.

Mi స్మార్ట్ బ్యాండ్ 6:

Mi Smart Band 6 అనేది Xiaomi యొక్క ఫిట్‌నెస్ బ్యాండ్ విభాగంలో సరికొత్త పరికరం. ఇది 1.56-అంగుళాల AMOLED టచ్ స్క్రీన్ డిస్ప్లేతో మంచి లుక్ ని ఇస్తుంది. ఫిట్‌నెస్ బ్యాండ్‌తో మనం రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు మరియు హృదయ స్పందన రేటును ట్రాక్ చేయవచ్చు. దాని 5ATM వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, మీరు దీన్ని స్విమ్మింగ్ కోసం కూడా తీసుకోవచ్చు. అమెజాన్‌లో రూ. 3,499కు లభిస్తోంది.

boAt Xtend Smartwatch:

ఇది అంతర్నిర్మిత అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ హృదయ స్పందన రేటు మరియు SPO2ని పర్యవేక్షిస్తుంది. 1.69-అంగుళాల LCD డిస్‌ప్లేతో ఈ వార్చ్ అందుబాటులో ఉంది. ఇది Amazonలో రూ.2,999కి లభిస్తుంది.

OnePlus స్మార్ట్ బ్యాండ్:

OnePlus స్మార్ట్ బ్యాండ్ మంచి ఎంపిక. ఇది డ్యూయల్ కలర్ స్ట్రాప్‌తో వస్తుంది. రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని చూపిస్తుంది. అమెజాన్‌లో రూ.1,699కే ఈ స్మార్ట్ బ్యాండ్ లభిస్తోంది.

SilverX M5 స్మార్ట్ బ్యాండ్:

SilverX M5 ఫిట్‌నెస్ బ్యాండ్ 1.1-అంగుళాల AMOLED టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఇది స్విమ్మింగ్‌కు కూడా పనికొస్తుంది..ఇది ఒత్తిడిని పర్యవేక్షించడంతో పాటు..ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. వినియోగదారులు తమ ఫోన్, కెమెరా షట్టర్ మరియు కాల్‌లోని ఆడియో ట్రాక్‌ను నియంత్రించడానికి ఈ బ్యాండ్‌ని ఉపయోగించవచ్చు. అమెజాన్‌లో రూ.749కే లభిస్తోంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version