సిని హాస్య నటుడు, ఎస్వీబీసి చైర్మన్ గా ఉన్న పృథ్వీ తన పదవికి రాజీనామా చేయడం వెనుక అసలు జరిగింది ఏంటీ…? ఇప్పుడు ఈ చర్చ ఎక్కువగా జరిగుతుంది. పృథ్వీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అమరావతి రైతుల విషయంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా చేసాయి అనేది వాస్తవం. రాజకీయంగా కూడా నష్టం జరిగే అవకాశం ఉందని,
ఆయనను పదవి నుంచి తప్పించి క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ కూడా వినపడింది. అయితే ఆయనను పదవి నుంచి దిగిపోవాలని, పార్టీ అధిష్టానం రెండు రోజుల క్రితమే స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. అయినా సరే ఆయన పదవి నుంచి దిగిపోవడానికి ఆసక్తి చూపించకపోవడంతోనే ఇన్నాళ్ళు గా ఓపిక పట్టి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఆయన వ్యవహారాలను బయటపెట్టారని అంటున్నారు.
ముఖ్యంగా ఉద్యోగులు చాలా మంది, ఆయనకు అధిష్టానం మద్దతు ఉండటంతో ఇన్నాళ్ళు సైలెంట్ అయ్యారని, ఆ తర్వాత ఆ అధిష్టానం సూచనతోనే ఆయన్ను పదవి నుంచి తప్పించడానికి చేసిన వ్యవహారాలను బయటపెట్టారని సమాచారం. అందుకే టీటీడీ కూడా కొందరు పెద్దల సూచనలతో రంగంలోకి దిగి ఆయనపై విచారణకు ఆదేశించిందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే నోరు అదుపులో లేక తన పదవిని పోగొట్టుకున్నారు పృథ్వీ.