ఎట్టకేలకు కృష్ణవంశీని కనుకరించిన ప్రకాష్ రాజ్.. ఏమైందంటే.?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ అలాగే విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్.. మధ్య ఎంత అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. అయితే అంతే స్థాయిలో అలకలు కూడా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ అనే క్యారెక్టర్ ఆర్టిస్టులోని హీరోయిజం చూపించాడు కృష్ణవంశీ. అంతఃపురం సినిమాలో తన విశ్వరూపం ప్రదర్శించాడు అంటే అందుకు కారణం కృష్ణవంశీనే అని చెప్పాలి. ఇక ఖడ్గం లో మరొక రూటులో ప్రకాష్ రాజ్ ని చూపించారు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ చేసిన అన్ని సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ మధ్యలో వీరిద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు. అంతేకాదు ప్రకాష్ రాజ్ ఇకపై కృష్ణవంశీతో పని చేయను అని కూడా చెప్పారు.

ఇక గోవిందుడు అందరివాడేలే సినిమాతో ఆ గొడవలు కాస్త సద్దుమణిగాయి. మళ్లీ కలిసి పని చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే నటసామ్రాట్ రీమేక్ రంగమార్తాండలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వీరిద్దరి మధ్య మళ్లీ గ్యాప్ వచ్చింది. సినిమా పూర్తయినా.. ఇంకా బయటకు రాకపోవడానికి కారణం ప్రకాష్ రాజ్ అనే గుసగుసలు కూడా వినిపించాయి.అందుకు కారణం ప్రకాష్ రాజ్ కి ఇప్పటివరకు పారితోషకం ఇవ్వలేదట. అందుకే ఆయన డబ్బింగ్ చెప్పుకోవడం లేదు అని సమాచారం. దాంతో సినిమాని రిలీజ్ చేసేందుకు కూడా మార్గం లేకుండా పోయింది.

కానీ ఎట్టకేలకు ప్రకాష్ రాజ్ కనికరించినట్లు సమాచారం. ఈ సినిమాకి తన గొంతు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజు తన పాత్రకు గాను తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు . రెండు రోజుల్లో డబ్బింగ్ పూర్తి అవగానే త్వరగా సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రకాష్ రాజుకు పారితోషకం ఇచ్చారా లేదా అన్న విషయం మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version