వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి వానా కాలంలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వానాకాలంలో కొన్ని ఆహార పదార్థాలను తినొచ్చా తినకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇప్పుడు వాన కాలంలో మొక్కజొన్న పొత్తు తీసుకువచ్చా లేదా అనే విషయాన్ని చూద్దాం. వర్షాకాలంలో వాన పడుతూ వాతావరణం చల్లగా ఉంటున్నప్పుడు వేడివేడి మొక్కజొన్నపొతులు తింటే ప్రతి ఒక్కరికి ఎంతో మజా వస్తుంది.
మొక్కజొన్న పొత్తులని ఉడికించుకుని తిన్నా కాల్చుకుని తిన్నా కూడా బాగుంటాయి వర్షాకాలంలో కండ్ల కలకల సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలామంది. మొక్కజొన్నలోని విటమిన్ ఏ విటమిన్ సి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కండ్లకలకల వంటి సమస్యలను దూరం చేయగలవు. వాన కాలంలో మొక్కజొన్న తింటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు చర్మ సంబందిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
విటమిన్ సి ఇందులో ఉంటుంది ఇది చర్మవ్యాధులను నివారిస్తుంది. వానకాలంలో మొక్కజొన్నపొత్తులని తినడం వలన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వానలో తడవడం వలన కానీ తేమ ఎక్కువగా ఉండటం వలన కానీ జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది మొక్కజొన్న తినడం వలన జుట్టు రాలదు మొక్కజొన్న లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎసిడిటీ గ్యాస్ వంటి ఇబ్బందులు ఉండవు ఎముకలు కూడా మొక్కజొన్న వలన దృఢంగా బలంగా మారుతాయి. కిడ్నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. రక్తహీనత సమస్య కూడా ఉండదు ఇలా ఎన్నో లాభాలను వానా కాలంలో మొక్కజొన్నతో పొందొచ్చు.