మైదా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ మైదాతో తయారుచేసిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్ట పడుతుంటారు. పిల్లల మొదలు పెద్దల వరకు రోజులో అనేక రకాల ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ వలన ఎన్ని నష్టాలు కలుగుతాయో మీకు తెలుసా..? ప్రాసెస్డ్ ఫుడ్ ఒక వ్యసనం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని వలన ఎక్కువ ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. క్రేవింగ్స్ పెరిగిపోయి. ఎప్పుడు తినే ఆహారం కంటే ఎక్కువ తీసుకుంటారు.
ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వలన కలిగే నష్టాలు:
ఎక్కువగా ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన తలనొప్పి, విపరీతమైన నీరసం కలుగుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలని తీసుకోకపోవడం వలన బరువు తగ్గడానికి అవుతుంది. పైగా దీర్ఘకాలిక సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
ప్రిజర్వేటిస్, ఆర్టిఫిషియల్ ఆహార పదార్థాలు:
- ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉండే ఈ పదార్థాలు అజీర్తి సమస్యలను కలిగిస్తాయి. తద్వారా మలబద్ధకం కలుగుతుంది.
- చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. యాక్ని సమస్య తలెత్తుతుంది.
ఒక నెలరోజుల పాటు మీరు ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం మానేస్తే బరువు తగ్గుతారు. చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి నిద్రని పొందడానికి అవుతుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు, ఊబకాయం, టైప్ టు డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
మంచి ఆరోగ్యం కోసం:
- ఉదయాన్నే మీరు పిజ్జా, బర్గర్ వంటి వాటికి బదులు ఇడ్లీ వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి.
- సోడా వంటి వాటిని తీసుకునే బదులు హెర్బల్ టీ తీసుకోండి.
- సాధారణ బటర్ కి బదులుగా నట్ బట్టర్ ట్రై చేయండి.
- బేక్ చేసిన ఆహార పదార్థాలని కాకుండా రోజు ఉడికించినవి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.