నేను మాస్కు పెట్టుకోను అయితే ఏంటి..? హోం మంత్రి షాకింగ్ కామెంట్స్.?

-

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులైన సెలబ్రిటీలుఅయినా ప్రజా ప్రతినిధులు అయిన అధికారులైనా… ప్రస్తుతం తప్పక మాస్కు ధరించాలి. లేకపోతే కరోనా పంజా విసిరి అది ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి అంటూ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు ప్రజా ప్రతినిధులు. కానీ ఇక్కడ హోం మంత్రి మాత్రం తాను మాస్క్ పెట్టుకోను అంటూ మీడియా ముందే తెగేసి చెప్పేసాడు.

మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మాస్క్ పెట్టుకోకుండా మీడియా ముందుకు రాగా.. మాస్క్ ఎందుకు ధరించలేదు అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో నేను మాస్కు ధరించను అయితే ఏమవుతుంది అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు మధ్యప్రదేశ్ హోమంత్రి నరోత్తమ్ మిశ్రా. ఇంకేముంది ఇక హోం మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలుపెట్టాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన నరోత్తమ్ మిశ్రా తనకు ఆరోగ్య సమస్యలు ఉండడం కారణంగానే మాస్కులు ధరించడం లేదని… ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి అంటూ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news