దిశ నిందితులకు ‘ఎంబామింగ్‌’ అంటే ఏంటి..?

-

దిశ అత్యాచార౦ హత్య కేసులో… నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపారు… వాళ్ళను దేశం మొత్తం కీర్తించింది. అంత వరకు బాగానే ఉంది… ఆ తర్వాత నుంచి వచ్చిన చిక్కులు ఒక్కొక్కటి పోలీసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఆ మృతదేహాలను భద్ర పరచాలని సుప్రీం కోర్ట్ చెప్పిన నేపధ్యంలో… గాంధీ ఆస్పత్రి వైద్యులకు చుక్కలు కనపడుతున్నాయి. ఆ మృతదేహాలను భాద్రతపరచడం వారికి ఇప్పుడు పెను సవాల్ గా మారింది… ఒక పక్క కుళ్ళిపోయే స్థితిలో అవి ఉన్నాయి…  

ముందు ఈ నెల 13 వరకు వాటిని భాద్రతప్రచారాల్ని హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా… తర్వాత మాత్రం ఏ ఆదేశాలు గాని స్పందనా కోర్ట్ నుంచి రాలేదు… దీనితో ఆస్పత్రి వర్గాల్లో ఇప్పుడు ఇది చికాకుగా మారింది. ఈ నేపధ్యంలోనే ఆ నలుగురి మృతదేహాలను ఎంబామింగ్‌ చెయ్యాలని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలా చేస్తే మరికొంత కాలం అవి పాడవకుండా ఉంటాయని వైద్యులు అంటున్నారు. అసలు ఎంబామింగ్‌ అంటే ఏంటి అంటే… మృతదేహంలోని రక్తనాళంలో ఉన్న రక్తం సహా ఇతర ద్రవ పదార్ధాలను తొలగించి…

ఆలస్యం చేయకుండా వాటిలోకి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. అయితే… కాల్చి చంపారు కాబట్టి బుల్లెట్ గాయాలు ఉన్నాయి. దీనితో ఆ ఫ్లూయిడ్స్ బయటకు కారిపోయే అవకాశం ఉన్న నేపధ్యంలో… మరింత జాగ్రత్తగా ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. దీనికి కోర్ట్ నుంచి అనుమతి లేకపోవడంతో ఉన్నతాధికారులకు వెంటనే లేఖలు రాయగా… కోర్ట్ నుంచి ఆదేశాలు వచ్చాయి… వెంటనే ఇంజక్షన్లు ఎక్కించారు… ఒక్కో ఇంజక్షన్ ధర… ఏడు వేలకు పైనే ఉంది. మరో రెండు రోజుల్లో త్రిసభ్య కమిటి వచ్చిన తర్వాత… మృతదేహాలను తల్లి తండ్రులకు అప్పగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news