నిత్యం ఏదొక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేస్తామని.. ఓ వైపు ప్రభుత్వాలు చట్టాలు చేేస్తుంటే.. మరోవైపు నేరాలు మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా చెల్లి అని పిలుస్తూనే బాలికను చెరబట్టాడో కామాంధుడు. రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఉప్పాడ సంతోష్ తనకు చెల్లెలు వరుసైన ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆ సమయంలో తీసిన వీడియోలను తాజాగా విదేశాల్లో ఉన్న బాలిక తండ్రికి పంపించాడు. దీంతో విషయం తెలిసిన బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.